కాజల్ అగర్వాల్ ప్రస్తుతం 'భారతీయుడు-2' చిత్రంలో కమలహాసన్ సరసన నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాకు సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అల్లరి నరేష్ కాజల్ జంటగా ఓ కొరియన్ మూవీ రీమేక్ చెయ్యనున్నట్లుగా చెబుతున్నారు. 'డాన్సింగ్ క్వీన్' అనే కొరియన్ సినిమాకు ఈ చిత్రం రీమేక్. ఈ సినిమా ఓ జంట యొక్క కథ అని.. ఆ జంట తమ నిజ జివితం లోని సమస్యలని ఎదుర్కొని.. తమ లక్ష్యాన్ని ఎలా చేదించిందో అనేది సినిమా కథ అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ని సంప్రదించగా.. కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సురేష్ బాబు చెబుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa