సీనియర్ అనగానే అదో రకం స్టెబిలిటీ వస్తుంది. దాంతో పాటు అనుభవం కూడా వచ్చి చేరడంతో ధీమా వస్తుంది. అప్పటికే అందరి విషయంలో ఒక అవగాహన ఉండడం వల్ల కచ్చితత్వం కూడా ఉంటుంది. ఇవన్నీ ఫరవాలేదు కానీ తమను మరింత ఎక్కువగా ఊహించుకుంటేనే అసలుకే ఎసరు వస్తుంది. ఇపుడు టాలీవుడ్లో ఫిల్మ్ మేకర్లకు సీనియర్ల షాక్ అలా ఇలా లేదుట.
టాలీవుడ్లో పది పదిహేనేళ్ళు పైబడి హీరోయిన్లుగా ఉన్న వారు కనిపిస్తారు. నాడు స్టార్ డం ఒక లెక్కన అనుభవించిన వారికి ఇప్పటికీ ఆ కిక్కు దిగడంలేదుట. దాంతో వారు పాత వైభవాన్నే కోరుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా ఇపుడు తన సీన్ ఏంటన్నది ఆలోచన చేయకుండా డిమాండ్ చేయడమే టాలీవుడ్ నిర్మాతలకు తలనొప్పి తెస్తోందట.అల వైకుంఠపురం సినిమాలో మంచి పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చిన టబు ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల కుర్రకారుకు కలల రాణి. ఆమె రీ ఎంట్రీలో కూడా అద్భుతమైన పాత్ర ఇచ్చి త్రివిక్రం ఇప్పటి జనాల్లో కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చాడు. ఇపుడు ఈ క్రేజ్ ని ఆసరాగా చేసుకుని టబు కోటికి పడగెత్తిందని టాక్.తనను సినిమాలో పెట్టుకోవాలంటే కోటి ఇవ్వాల్సిందేనని టబు చేస్తున్న డిమాండ్ తో ఫిల్మ్ మేకర్లకు నోట మాట రావడంలేదుట. ఈ విధంగా ఒక మంచి ప్రాజెక్ట్ ని కూడా టబు జారవిడుచుకుందని అంటున్నారు. అదే విధంగా మరో సీనియర్ హీరోయిన్ కాజల్ కూడా తన డిమాండ్ ని ఎక్కడా తగ్గించుకోవడంలేదుట.డైరెక్టర్ తేజా ఆమెకు నేనే రాజు, నేనే మంత్రి మూవీ ద్వారా మళ్ళీ లైఫ్ ఇచ్చాడు. అటువంటి తేజా కొత్త మూవీ కోసం హీరోయిన్ గా అడిగితే ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసిందని టాక్. దాంతో చిత్ర యూనిట్ వేరే హీరోయిన్ని బుక్ చేసుకుంటున్నారుట.
ఇక తమన్నా కూడా ఇలాగే హై రెమ్యునరేషన్ అడుగుతోందిట. ఈ అమ్మడు కూడా ముప్పయేళ్ళ ప్రాయంలో ఉంది. సీనియర్లు తప్ప యంగర్ జనరేషన్ ఆమెను పక్కన పెట్టేశారు. దాంతో వెటరన్ హీరోలకు ఉన్న హీరోయిన్ల కొరతను ద్రుష్టిలో పెట్టుకుని తమన్నా గట్టిగానే డిమాండ్ చేస్తోందట. దాంతో ఆమెకు అంత ఇచ్చుకోలేక ఇదేంటిరా బాబూ అనుకోవడం నిర్మాతల వంతు అవుతోందిట. ఇదే వరసలో చాలా మంది హీరోయిన్లుగా చేసి క్యారక్టర్ ఆర్టిస్టులుగా మారిన వారు, సీనియర్ హీరోయిన్లు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని చేస్తున్న డిమాండ్ తో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల తలబొప్పి కడుతోందిట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa