ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రొమాంటిక్ థ్రిల్లర్ గా 'కనులు కనులను దోచాయంటే' : దుల్కర్ సల్మాన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 06:21 PM

మలయాళ స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ కి, తమిళ.. తెలుగు భాషల్లోను మంచి క్రేజ్ వుంది. ఆ మధ్య 'మహానటి'లో జెమినీ గణేశన్ పాత్రలో మెప్పించిన ఆయన, తాజాగా తమిళంలో 'కన్నుమ్ కన్నుమ్ కల్లైయాడి తాల్' సినిమా చేశాడు. దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన జోడీగా రీతూ వర్మ నటించింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను రేపు విడుదల చేయనున్నారు.


తెలుగు టైటిల్ గా 'కనులు కనులను దోచాయంటే'ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.."రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. కథాకథనాలు .. పాటలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. మొదటి నుంచి కూడా నేను రీమేక్ లకు వ్యతిరేకిని. కొత్తగా వున్న కథలను చేయడానికే ఇష్టపడతాను. అలా కథాపరంగా .. పాత్ర పరంగా కొత్తగా అనిపించడం వల్లనే ఈ సినిమా చేశాను. ఈ సినిమా తప్పకుండా నాకు విజయాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది. డైరెక్ట్ తెలుగు సినిమా చేయమంటూ కొన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో చేసే అవకాశాలు వున్నాయి" అని చెప్పుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa