బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నవరాత్రి ఉత్సవాలలో సందడి చేసింది. అహ్మదాబాద్‌లో తన తాజా చిత్ర బృందంతో కలిసి గర్భ డ్యాన్స్ చేసింది. గ్రీన్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ప్రియాంకని చూసిన వీక్షకుల ఆనందానికి అంధలు లేకుండా పోయాయి. ప్రస్తుతం ప్రియాంక డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియాంక ..మూడేళ్ళ తర్వాత హిందీలో ది స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటించింది . ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ కథానాయకుడిగా నటించారు . ఇందులో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంలో జైరా వసీమ్ కూడా ముఖ్య పాత్రలో నటించింది. ప్రియాంక తల్లి పాత్రలో జరీనా కనిపించనుంది. అక్టోబర్ 11,2019న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు.
આદિત્યને @AdityaGadhvi03 ખબર છે કે મને ગરબા નથી આવડતા પણ પ્રિયંકાને જોયા પછી કોને યાદ રહે!? I must say that @priyankachopra is too good when it comes to garba. She loves Gujarati kadhi ☺#TheSkyIsPink #PriyankaChopra #ShankusDandiya2019 pic.twitter.com/AsCfbEEMQH
— Aditi Raval (@aditiraval) September 30, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa