తమిళ స్టార్ హీరోలలో ఒకరైన తల అజిత్ తాజాగా నెర్కొండ పార్వై చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీలో అజిత్ ఇంటెలిజెంట్ లాయర్ పాత్రలో ఇరగ దీశారు. దర్శకుడు హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మించడం గమనార్హం. కాగా కాంబినేషన్లో అజిత్ మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం అజిత్ ఫుల్ మేక్ ఓవర్ అవువుతున్నారట. ఇందుకోసం ఆయన డైలీ జిమ్ కి వెళుతూ బరువు తగ్గడంతో పాటు, కండలు పెంచే పనిలో పడ్డారని సమాచారం. గత ఆగస్టులో అధికారికంగా ప్రారంభమైన ఈ చిత్రాన్ని కూడా బోనీ కపూర్ నే నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్న ఈ మూవీ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa