ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడో తరగతి ఎగ్జామ్స్ రాసిన మలయాళ నటుడు ఇంద్రాన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 21, 2026, 10:52 AM

ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రాన్స్ (68) తన చదువును పూర్తి చేయాలనే కలను నెరవేర్చుకున్నారు. పేదరికం కారణంగా నాలుగో తరగతిలోనే చదువు ఆపేసిన ఆయన, కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అక్షరలక్ష్యం’ పథకం ద్వారా ఏడో తరగతి తత్సమాన పరీక్షకు ఏప్రిల్ 20న తిరువనంతపురంలోని అట్టక్కుళంగర సెంట్రల్ హైస్కూల్‌లో హాజరయ్యారు. 550కి పైగా చిత్రాల్లో నటించి, జాతీయ అవార్డు అందుకున్న ఇంద్రాన్స్, వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వృద్ధాప్యంలోనూ నేర్చుకోవాలనే ఆయన తపన ఎందరికో స్ఫూర్తినిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa