ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబ‌ర్ 11న ధియేట‌ర్ల‌లోకి `RDX ల‌వ్‌`

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 01:43 AM

ఇటీవ‌ల విడుద‌లైన `RDX ల‌వ్‌`. టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  RX 100` ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్‌, తేజస్ కంచ‌ర్ల ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ మునీష్ సమర్ప‌కుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న‌ చిత్రం `RDX ల‌వ్‌`. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్పారు.  ద‌ర్శ‌క నిర్మాత‌లు.


ఈ ట్రైల‌ర్‌లోని యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్‌తో పాయ‌ల్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న నేప‌ధ్యంలో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కాగా ఈ సినిమాలో సీనియ‌ర్ న‌రేశ్‌, నాగినీడు, తుల‌సి, ఆమ‌ని త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa