ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రివిక్రమ్ కొత్త సినిమాలో పూజా హెగ్డే?

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2026, 10:42 AM

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం - AK 47’ సినిమాలో పూజా హెగ్డే భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో త్రివిక్రమ్-పూజా కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు విజయవంతమయ్యాయి. ‘గుంటూరు కారం’ తర్వాత పూజాకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’లో ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా కనిపించవచ్చని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa