‘ప్రేమలు’ చిత్రం ద్వారా మలయాళ నటి మమితా బైజు దక్షిణాదిలో, ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆఫర్లు తక్కువగా ఉన్నా, తమిళంలో విజయ్, సూర్య, ధనుష్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు పొందారు. విజయ్ ‘జననాయగన్’లో ఆయన కూతురిగా, సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో తనకంటే 20 ఏళ్లు పెద్ద వ్యక్తిని ప్రేమించే యువతిగా, ధనుష్ ‘కరలో’లో పల్లెటూరి అమ్మాయిగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాత్రల ద్వారా తన నటనలోని వైవిధ్యాన్ని నిరూపించుకోవడానికి మమితా ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa