రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే రూ. 761 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్, మహేష్ బాబు, అలియా భట్, రామ్‌గోపాల్ వర్మ వంటి సినీ దిగ్గజాలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా, సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ సినిమాను 'ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా' అని అభివర్ణిస్తూ, ఆదిత్య ధర్‌ను 'బాక్సాఫీస్ కా బాప్' అని కొనియాడారు. ఈ చిత్రం 2 వేల కోట్ల క్లబ్‌ను దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa