దర్శకుడు Aditya Dhar తెరకెక్కించిన భారీ స్పై యాక్షన్ చిత్రం ‘Dhurandhar 2’ రికార్డు వసూళ్లతో కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా, 500 కోట్ల మార్క్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ చిత్ర జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు థియేటర్ల సంఖ్యను కూడా పెంచుతున్నారు నిర్మాతలు. తాజాగా ఆస్ట్రేలియాలో ఈ చిత్రం అరుదైన ఘనతను నమోదు చేసింది.జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌లపై Aditya Dhar, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. Ranveer Singh, Sara Arjun ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే Arjun Rampal, Sanjay Dutt, R. Madhavan తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమాటోగ్రఫీని వికాస్ నౌలఖా, ఎడిటింగ్‌ను శివకుమార్ వి. పానికర్ నిర్వహించగా, సంగీతాన్ని శాశ్వత్ సచ్‌దేవ్ అందించారు. ఈ చిత్రం మార్చి 19న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.నటీనటుల పారితోషికాలు, టెక్నికల్ ఖర్చులు, ప్రమోషన్లతో కలిపి ఈ చిత్రానికి సుమారు 280 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాభాల్లోకి రావాలంటే కనీసం 280 కోట్ల షేర్, 600 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని అంచనా.భారతదేశంలో పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 43 కోట్ల రూపాయలు, తొలి రోజు 102.55 కోట్లు, రెండో రోజు 80.72 కోట్లు, మూడో రోజు ఇప్పటివరకు 87 కోట్ల రూపాయలు వసూలు చేసి, మొత్తం 313 కోట్ల నెట్, సుమారు 330 కోట్ల గ్రాస్ సాధించింది.విదేశాల్లోనూ సినిమా సత్తా చాటుతోంది. ఒక్క నార్త్ అమెరికాలోనే ఇప్పటివరకు 6.79 మిలియన్ డాలర్లు (సుమారు 63.8 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఓవర్సీస్‌లో మొత్తం పెయిడ్ ప్రీమియర్స్, డే 1 కలిపి 54.10 కోట్ల రూపాయలు, రెండో రోజు 39.3 కోట్ల రూపాయలు వసూలు చేసి, మొత్తం 93.4 కోట్ల గ్రాస్ సాధించింది. ఇండియా, ఓవర్సీస్ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 425 కోట్ల రూపాయలు రాబట్టింది.ఆస్ట్రేలియాలో ఈ చిత్రం తొలి రోజున 690K ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు 4.53 కోట్ల రూపాయలు) వసూలు చేసి, ఆ దేశంలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో Baahubali 2: The Conclusion మరియు RRR ముందున్నాయి. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఈ సినిమా 2.64 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు 17.36 కోట్ల రూపాయలు) రాబట్టింది. అలాగే శనివారం ఒక్కరోజు 1.15 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసి, ఒకే రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా, ఆస్ట్రేలియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఒక్కరోజులో 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల మార్క్ దాటిన తొలి భారతీయ సినిమాగా, అలాగే ఒకే రోజులో 50 వేలకుపైగా టికెట్లు విక్రయించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డులు సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa