'పాతాళ భైరవి' చిత్రం 1951 మార్చి 1న విడుదలైంది. నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. కేవీ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు నటించిన ఈ జానపద ఫాంటసీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ఊహాశక్తిని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. కాశీ మజిలీ, అల్లావుద్దీన్ కథల స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమాలో మాయాజాలాలు, రాక్షసులు, మాంత్రికులు వంటి అంశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఘంటసాల సంగీతం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, మార్కస్ బార్ట్‌లే ఛాయాగ్రహణం సినిమా విజయానికి దోహదపడ్డాయి. 28 కేంద్రాలలో 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa