ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 04:48 PM

పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా సందడి మొదలైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 15న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుంది. అలానే అభిమానులకు మరో ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈరోజు (మార్చి 14) సాయంత్రం 6:30 గంటలకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa