ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతున్న 'బూకీ'

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 04:22 PM

ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన విడుదలైన తమిళ సినిమానే 'పూకీ'. తెలుగులో ఈ సినిమాను 'బూకీ' పేరుతో విడుదల చేశారు. విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ దిశాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో, నాయికగా ధనూషా అలరించింది. గణేశ్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ్ ఆంటోని తన సొంత బ్యానర్ పై నిర్మించడమే కాకుండా, సంగీతాన్ని సమకూర్చాడు. అలాంటి ఈ సినిమా ఈ నెల 13వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 


వైజాగ్ కి చెందిన  మిడిల్ క్లాస్ యువకుడు కైలాశ్ (అజయ్ దిశాన్). అతను .. ఆశ ( ధనూష) ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ ఉంటారు. తనని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అతను ఎంత మాత్రం సహించడు. అతని తొందరపాటు పట్ల ఆశ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఇద్దరూ నడి రోడ్డుపై గొడవపడవలసి వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు సెల్ ఫోన్స్ లో వీడియో తీయడంతో ఆ సంఘటన కాస్తా వైరల్ అవుతుంది. దాంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిపోతుంది.బ్రేకప్ అయితే చెప్పుకుంటారుగానీ .. ఇద్దరూ ఒకరిని ఒకరు మరిచిపోలేకపోతుంటారు. తమ మనసును మళ్ళించడం కోసం కైలాశ్ 'జిమ్'కి వెళ్లడం మొదలుపెడతాడు. ఆశ ఆధ్యాత్మికత వైపు వెళుతుంది. అయినా అక్కడ కూడా వారికి తాము ఆశించిన రిజల్ట్ మాత్రం కనిపించదు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరికీ కూడా స్నేహితులు ఒక విషయం చెబుతారు. ఒకరిని పూర్తిగా మరిచిపోవాలంటే, మరొకరిని కొత్తగా జీవితంలోకి ఆహ్వానించాలని అంటారు. ఆ మాట వాళ్లకి సరైనదిగానే అనిపిస్తుంది. స్వామిజీ ఆశ్రమంలో పరిచయమైన 'రాహుల్' తో ఆశ సాన్నిహిత్యంగా ఉండటం మొదలుపెడుతుంది. అలాగే కైలాశ్ కూడా, శ్రీమంతుల కుటుంబానికి  చెందిన 'కావ్య'కి చేరువవుతూ ఉంటాడు. కొత్తగా మొదలైన వారి ప్రేమకథలు ఏ తీరానికి చేరుకుంటాయి? వాళ్లిద్దరికీ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది మిగతా కథ. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa