తెలుగు, తమిళ రెండు ఇండస్ట్రీస్ లో శ్రుతి హాసన్ కు మంచి క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లోను ఆమె స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇక్కడ కెరియర్ మంచి జోరుగా సాగుతోన్న సమయంలోనే బాలీవుడ్ పై ఆసక్తిని చూపుతూ అక్కడికి వెళ్లింది. అక్కడ అవకాశాలు వస్తుండగానే ప్రేమలో పడి కెరియర్ పై శ్రద్ధ పెట్టడం మానేసింది. ఫలితంగా ఈ మూడు భాషల్లోను ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి.. ప్రేమ కూడా విఫలమైపోయింది. దాంతో తిరిగి ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమా కోసం గోపీచంద్ మలినేని ఆమెను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా చేయడానికి శ్రుతి హాసన్ అంగీకరించిందనేది తాజా సమాచారం. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'బలుపు' విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ మలినేనితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa