ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ప్రారంభమైన 'ఉస్తాద్ భగత్ సింగ్' అడ్వాన్స్ బుకింగ్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 04:12 PM

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ నెల 19న వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఏపీలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద సందడి మొదలైంది.బ్లాక్‌బస్టర్ హిట్ 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పుడు సినిమా సందడి మొదలైంది. ఏపీలోని పలు సినిమా హాళ్లు నెమ్మదిగా అడ్వాన్స్ బుకింగ్స్‌ను తెరుస్తున్నాయి. ఇందులో బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. త్వరలోనే అన్ని థియేటర్లలోనూ బుకింగ్స్ పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి.అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ ఈ రోజు సాయంత్రం 6.30 గంట‌ల‌కు సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa