ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాషన్ ఈ-కామర్స్ లో అడుగుపెట్టిన మలైకా అరోరా

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 04:13 PM

బాలీవుడ్ నటి, ఫ్యాషన్ ఐకాన్ మలైకా అరోరా సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఫ్యాషన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ 'మింత్రా'కు  చెందిన హోల్‌సేల్ విభాగం ఎంజెఐపీఎల్, 'ఎక్సీడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌'తో కలిసి 'మేజాయ్' (Maejoy) పేరిట ఒక ప్రీమియం లైఫ్‌స్టైల్ యాక్సెసరీస్ బ్రాండ్‌ను ఆమె లాంచ్ చేశారు.ఆధునిక మహిళల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన ఈ బ్రాండ్‌లో 250కి పైగా స్టైలిష్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్రాస్‌బాడీ బ్యాగ్స్, షోల్డర్ బ్యాగ్స్, టోట్స్, బ్యాక్‌ప్యాక్స్, క్లచెస్ వంటి రకరకాల హ్యాండ్‌బ్యాగులతో పాటు.. ఐజీఐ (IGI), జీసీఐ (GCI) సర్టిఫైడ్ ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ (ప్రయోగశాలలో రూపొందించిన వజ్రాభరణాలు) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఉంగరాలు, ఇయర్‌రింగ్స్, పెండెంట్స్, బ్రాస్‌లెట్స్ వంటి ఆభరణాలు సిల్వర్, గోల్డ్, రోజ్-గోల్డ్ టోన్స్‌లో లభిస్తాయి.వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాలను ప్రతిబింబించేలా 'ద జాయ్ ఆఫ్ బీయింగ్ మీ'  అనే కాన్సెప్ట్‌తో ఈ బ్రాండ్‌ను తీసుకొచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa