ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు సినిమాలకు సిద్ధు జొన్నలగడ్డ గ్రీన్ సిగ్నల్!

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 03:25 PM

‘తెలుసు కదా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆయన ఒక సోషియో ఫాంటసీ సినిమాతో పాటు, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్‌తో మరో సినిమా, అలాగే మరో దర్శకుడితో ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విభిన్నమైన కథలతో కూడిన ఈ మూడు సినిమాలతో తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు.నిజానికి ‘తెలుసు కదా’ సినిమా సాలిడ్ హిట్ అవుతుందని సిద్ధు నమ్మాడు, కానీ ఆ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa