ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవర్‌ఫుల్, స్టైలిష్ గా నాగార్జున 100వ చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 12:16 PM

అక్కినేని నాగార్జున తన ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమా గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, 'కింగ్ 100' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది అని సమాచారం. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా దర్శకుడు కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  నాగార్జునను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు కార్తీక్ తెలిపారు. గతంలో నాగార్జున కెరీర్‌లో కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిన శివ‌, ర‌క్ష‌కుడు వంటి చిత్రాల్లో కనిపించిన పవర్‌ఫుల్, స్టైలిష్ అవతారంలో ఆయన మరోసారి దర్శనమివ్వనున్నారని స్పష్టం చేశారు. అలాగే కథానుసారం ఈ సినిమాలో నాగార్జున ఏకంగా మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని తెలిపారు. ఈ సినిమా కోసం నాగార్జున ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని, ఆయన లుక్ అభిమానులకు పండగలా ఉంటుందని దర్శకుడు హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa