ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డేవిడ్ రెడ్డి' కోసం మంచు మనోజ్ కొత్త అవతారం

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 03:12 PM

నటుడు మంచు మనోజ్ తన రాబోయే చిత్రం 'డేవిడ్ రెడ్డి' కోసం తన రూపాన్ని మార్చుకుంటున్నారు. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాలో యోధుడి పాత్ర పోషించడానికి మూడు వారాలుగా కఠోరంగా శ్రమిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. సౌకర్యాలను పక్కనపెట్టి కష్టపడాలని నిర్ణయించుకున్నానని, యాక్షన్ సినిమాల్లో ప్రతి దెబ్బకు శరీరం సిద్ధంగా ఉండాలని, కెమెరా అబద్ధం చెప్పదని ఆయన పేర్కొన్నారు.ఈ సినిమా కోసం కండలు పెంచుతున్నాడు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్ గా రాబోతుంది. అంతేకాదు  “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ న‌టించ‌లేరని చెప్పుకొచ్చారు.  ప్రతి దెబ్బకు మీ శ‌రీరం సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఇది కేవలం లుక్ కోసం కాదని చెప్పుకొచ్చాడు. గత 21 రోజుల్లో వర్కౌట్స్ కారణంగా తాను పూర్తిగా మారిపోయానన్నారు. మంచు మనోజ్.. ‘మిరాయ్’ సినిమాలో తన విలనిజంతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అంతేకాదు త్వరలో బాలయ్య, గోపీచంద్ సినిమాలో విలన్ గా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మనోజ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa