ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడబిడ్డకి జన్మనిచ్చిన రణదీప్ హుడా దంపతులు

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 11:42 AM

బాలీవుడ్ చిత్రాలలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులని అబ్బురపరిచే విలక్షణ నటుడు రణదీప్ హుడా ఇంట పండంటి ఆడబిడ్డ అడుగుపెట్టింది. ఆయన భార్య లిన్ లైష్రామ్ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఆ దంపతులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తమ కుటుంబంలోకి వచ్చిన ఈ కొత్త అతిథి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.అయితే, చిన్నారి రాకతో ఆనందం హుడా కుటుంబానికి రెట్టింపు కావడం విశేషం. ఈ చిన్నారి సరిగ్గా రణదీప్ హుడా తండ్రి రణబీర్ హుడా పుట్టినరోజు నాడే జన్మించింది. తాత, మనవరాలు ఒకే రోజు బర్త్ డే జరుపుకోనుండటంతో ఇది తమకు అత్యంత ప్రత్యేకమైన, భావోద్వేగమైన క్షణమని ఈ జంట పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa