ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమా లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2026, 07:27 PM

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమా లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్‌లో నూతనంగా నిర్మించిన స్పెషాలిటీ బ్లాక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' చిత్రం కోసం పూర్తిగా మారిపోయిన ఆయన మేకోవర్ అందరి దృష్టినీ ఆకర్షించింది.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తన తాత, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.కర్ణాటకకు రావడం అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినట్లు ఉంటుంది. 1983 మార్చి 20న ఇదే ఆసుపత్రికి మా తాతగారు శంకుస్థాపన చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు అదే నెలలో నేను ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతం. ఇది తాతగారి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ వల్లే సాధ్యమైంది అని అన్నారు.ఆయన్ను చూసేందుకు ఆసుపత్రి వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వారికి అభివాదం చేస్తూ, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.డాక్టర్ అయితే ఏ స్పెషలిస్ట్ అవుతారు అన్న ప్రశ్నకు, తనకు పిల్లలంటే ఇష్టం కాబట్టి పీడియాట్రిషియన్ అవుతానని సమాధానమిచ్చారు.ప్రస్తుతం ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన చెవికి రింగ్ పెట్టుకుని కొత్త హెయిర్‌స్టైల్‌తో కనిపించారు. ఈ చిత్రంలో ఆయన సరసన రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa