యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వేల్పుపల్లి,నాగాయపల్లి గ్రామంల్లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులైన కూరేళ్ల పద్మ అశోక్,ధారవత్ మౌనిక ప్రవీణ్ కు పట్టు బట్టలు పెట్టి,యాట పొట్టేలును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ, పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని అన్నారు.ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa