సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల హోలీ వేడుకల్లో పాల్గొన్న ఓ కార్యక్రమంలో 'ఆంటీ' అంటూ కొందరు నెటిజన్లు ఆమెను అవమానించారు. దీనిపై అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఆన్ లైన్ లోనే కాకుండా ఆఫ్ లైన్ లోనూ ఎదురైన ఈ అనుభవంపై ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టారు. తప్పు చేసేవారిని వదిలేసి, ఎదుర్కొనేవారిని టార్గెట్ చేస్తున్నారని, వయోబేధం, లింగ వివక్ష, స్త్రీ ద్వేషం సరికాదని ఆమె పేర్కొన్నారు. ‘నేను ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి సిగ్గుపడను. నేను సాధించిన విజయాలు, నా ప్రయాణం గురించి నేను గర్వపడుతున్నాను. ఎన్ని విమర్శలు ఎదురైనా తట్టుకొని నిలబడిన ధైర్యమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేనేంటో చూపిస్తుంది. కానీ నన్ను విమర్శించడానికి మీరెవరు?. లైంగిక వేధింపులను, దుర్వినియోగదారులను హైలైట్ చేసి, ఉన్నతంగా నిలబడి ఉన్నవారిని సిగ్గుపడేలా చేయడానికి నేను ప్రయత్నిస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు?’’ అంటూ ట్రోలర్స్‌కు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa