ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృషకర్మ నా కెరీర్ బెస్ట్ సినిమా: నాగచైతన్య

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 03:43 PM

‘తండేల్‌’ తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా త్వరలో విడుదల కానుంది. కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ పై అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్‌ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. ఇవాళ నాకు ఎంతో ఆనందంగా ఉంది. ‘వృషకర్మ’ గ్లిమ్స్ లాంచ్ చేశాం. ఈ మోమెంట్ కోసం నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇది నా కెరీర్ లో 100% బెస్ట్ సినిమా అవ్వబోతుంది. ఇది ఇప్పుడే కాదు.. నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు యాక్టర్ గా ఒక కోరిక అలా ఉండిపోయింది. లార్జ్ స్కేల్ స్పెక్టికల్ ఫిలిం.. మిథికల్ లేయర్ ఉన్న ఒక విఎఫ్ఎక్స్ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. దానికి వృషకర్మ సినిమానే ఆన్సర్. అందుకు కార్తీక్ కి థాంక్యూ చెప్పాలి'''తండేల్' సినిమా రిలీజ్ అయ్యే ముందే కార్తీక్ ‘వృషకర్మ’ అనే స్క్రిప్ట్ రాస్తున్నాడని నాకు తెలిసింది. నేను నిర్మాత బాపీని వెళ్లి రిక్వెస్ట్ చేశాను.. కార్తీక్ ని కూడా రెండు మూడు సార్లు కలిశాను. ఏదైనా అవకాశం ఉంటే నేను ఈ మూవీ చేస్తానని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత వాళ్లు ఈ సినిమా కోసం నా దగ్గరకు వచ్చారు. నన్ను నమ్మినందుకు వాళ్లకి థ్యాంక్యూ. స్క్రిప్ట్ విన్న తర్వాత మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. కథ విన్నాక ఇలాంటి సినిమా ఎలా చేస్తామని నాలో ఎన్నో డౌట్స్ ఉన్నాయి. లార్జర్ దెన్ లైఫ్ సినిమా... ఎలా అచీవ్ చేయగలమని కార్తీక్ ని అడిగాను. ప్రతీ షెడ్యూల్ ముందు టీమ్ తమ వర్క్ తో ఆన్సర్స్ ఇస్తూ వచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa