ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్-రష్మిక రిసెప్షన్: స్టార్ హీరోల గైర్హాజరుపై చర్చ

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 02:08 PM

ఇటీవల ఉదయ్ పూర్ లో వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక జంట హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ను నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి కొందరు స్టార్ హీరోలు హాజరు కాలేదు. వీరి గైర్హాజరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మహేష్ బాబు 'వారణాసి', ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్ కోసం విదేశాల్లో బిజీగా ఉండటంతో రాలేకపోయారని సమాచారం. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ తో ఉన్నారని, ప్రభాస్ ఇలాంటి కార్యక్రమాలకు అంతగా ఆసక్తి చూపించరని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa