ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘టాక్సిక్' చిత్రం విడుదల వాయిదా

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 03:51 PM

యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్’. కేజీఎఫ్‌ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న ఈ పాన్-గ్లోబల్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థలు ఇవాళ‌ అధికారికంగా ప్రకటించాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు జూన్ 4న థియేటర్లలోకి రానుంది.మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, సంక్షోభ పరిస్థితులే ఈ వాయిదాకు ప్రధాన కారణంగా చిత్రబృందం పేర్కొంది. సినిమా ప్రధాన పంపిణీ భాగస్వాములలో ఒకరైన ఫార్స్ ఫిల్మ్స్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేవీఎన్‌ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ తెలిపాయి. గల్ఫ్ ప్రాంతం ఈ సినిమాకు కీలకమైన మార్కెట్ కావడంతో అక్కడి సినిమా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో ఈ కఠిన నిర్ణయం తప్పలేదని వివరించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa