ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివాజీ రాజాకి పితృవియోగం

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 02:55 PM

నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన స్వగృహంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో శివాజీ రాజా, ఆయన కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.రామరాజు భౌతికకాయాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ప్రస్తుతం వారి నివాసంలోనే ఉంచారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa