సంపత్ నంది – యాక్షన్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో రానున్న సినిమా కబడ్డీ నేపథ్యంలో సాగుతుందని సోషల్ మీడియాలో ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. గోపీచంద్ కోసం మంచి యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట సంపత్ నంది. సినిమాలో అయితే ఎలాంటి కబడ్డీ నేపథ్యం ఉండదని తెలుస్తోంది. అలాగే డిసెంబర్ లో ఈ సినిమా పట్టాలెక్కెనుందట. ఇక గత కొన్ని సినిమాలుగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న గోపీచంద్, సంపంత్ సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీని పండించనున్నాడు. కాగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటించనుంది. సపంత్ నంది గోపీచంద్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని… సినిమా మొత్తం మీద గోపిచంద్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆ పాత్రలోని వేరియేషన్స్ కారణంగానే సినిమాలో కామెడీ సీక్వెన్స్ హైలెట్ గా నిలుస్తాయట. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa