సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఉగాది, శ్రీరామ నవమి, అంబేడ్కర్ జయంతి సెలవులను పురస్కరించుకుని ఈ తేదీని ఖరారు చేశారు. మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన ఆయన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. చిన్నతనంలో తన తండ్రి నటశేఖర కృష్ణతో కలిసి నటించిన ‘గూఢచారి 117’ సినిమా 1989 ఏప్రిల్ 21న విడుదలై వంద రోజులకు పైగా ఆడింది. ఇక హీరోగా మారిన తర్వాత 2000 ఏప్రిల్ 14న వచ్చిన ‘యువరాజు’ కూడా ఘనవిజయం సాధించి ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.
మహేష్ బాబును టాలీవుడ్ సూపర్ స్టార్ గా నిలబెట్టిన ‘పోకిరి’ సినిమా 2006 ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టేయడమే కాకుండా, మహేష్ స్టార్‌డమ్‌ను శిఖరాగ్రానికి చేర్చింది. మాస్ ప్రేక్షకుల్లో ఆయనకు తిరుగులేని ఇమేజ్‌ను తెచ్చింది. ఆ తర్వాత 2018 ఏప్రిల్ 20న వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా కూడా రూ. 225 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇలా ఏప్రిల్ నెలలో వచ్చిన ప్రతి సినిమా మహేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa