సీనియర్ నటీనటులు శివాజీ, లయ చాలా కాలం తర్వాత జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో కాకుండా, నేరుగా డిజిటల్ వేదికగా విడుదలవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఈ టీవీ విన్ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa