ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్... 500 మంది డ్యాన్సర్లకు ఉచిత ఆరోగ్య బీమా

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 02:23 PM

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకు వచ్చారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, హెల్త్ కార్డుల పంపిణీ ప్రతిపాదనను ఆమోదించారు. సినిమా షూటింగ్‌లలో రిస్క్‌తో కూడిన ఫీట్లు చేసే డ్యాన్సర్లు ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అనారోగ్యంతో బాధపడినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి బాటలోనే సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న చరణ్, ఈ కార్యక్రమాన్ని తన భార్య ఉపాసనతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ‘పెద్ది’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, సినీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంపై డ్యాన్సర్ సంఘాలు, పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం 500 కుటుంబాలకు వైద్యపరమైన భరోసా కల్పించిందని, ఆయన నిజమైన హీరో అని ప్రశంసిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa