ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రికార్డులు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. డిజిటల్ హక్కులను దక్కించుకున్న జీ 5 (Zee5) సంస్థ, ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తెలుగుతో పాటు ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. భీమ్స్ సంగీతం, నయనతార నటన, వెంకటేష్ కామియో ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa