ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మహారాజు'గా నందమూరి నటసింహం!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 03, 2026, 12:29 PM

నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి పనిచేస్తున్న ఈ చిత్రానికి 'మహారాజు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మొదట అనుకున్న చారిత్రక కథను బడ్జెట్, మేకింగ్ సమయం వంటి కారణాలతో పక్కన పెట్టి, కొత్త కథాంశంతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. ఈ కొత్త వెర్షన్ బలమైన ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌పై దృష్టి సారించనుంది. బాలకృష్ణ సరసన నయనతార నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa