ప్రముఖ బ్రిటిష్ ఇండియన్ నటి మీరా సియాల్ (64) కు ప్రతిష్ఠాత్మక డేమ్‌హుడ్ అవార్డు లభించింది. కొత్త సంవత్సరాది సందర్భంగా బ్రిటన్‌లో కింగ్ చార్లెస్-3 ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఆమె అందించిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. లండన్‌లో డిసెంబరు 30న అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేశారు. మీరా సియాల్ ‘గుడ్‌నెస్ గ్రేషియస్ మి’, ‘ది కుమార్స్ ఎట్ నం.42’ వంటి కామెడీ సిరీస్‌ల ద్వారా గుర్తింపు పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa