ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్‌ కొత్త సినిమా ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 01, 2026, 02:54 PM

కొత్త ఆశలు, అంచనాలతో సినీ తారలందరూ 2026కు స్వాగతం పలికారు. ఈ న్యూ ఇయర్‌కు పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త చెబుతూ ఒక బహుమతిని అందించారు. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.పవన్‌ను మునుపెన్నడూ చూడని అత్యంత స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో చూపించబోతున్నారట. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్లను దృష్టిలో పెట్టుకుంటే, ఈ సినిమా కూడా మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa