మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ నటించిన ‘దండోరా’ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. కులం, అహంకారం, సామాజిక హోదా చుట్టూ తిరిగే గ్రామస్తుల సంఘర్షణలను ఈ విలేజ్ డ్రామా కళ్లకు కట్టినట్లు చూపించింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. జనవరి మూడవ వారం నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa