ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రెండింగ్‌ రీల్‌తో.. పెళ్లి తేదీని ప్రకటించిన అల్లు శిరీష్‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 01:50 PM

నటుడు అల్లు శిరీష్‌ వచ్చే ఏడాది మార్చి 6న తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్‌ అవుతోన్న ఓ పాటతో అల్లు అయాన్‌, అర్హలతో రీల్‌ చేస్తూ శిరీష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 'బాబాయ్‌ సంగీత్‌ ఎప్పుడు ఉంటుంది' అని అడిగినప్పుడు, 'మనం దక్షిణాది వాళ్లం.. అలాంటివి చేసుకోం' అని ఆయన బదులిచ్చారు. ఇక అల్లు అర్జున్‌ - స్నేహారెడ్డి వివాహం కూడా 2011లో మార్చి 6నే జరగడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa