ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ల వసూళ్ల దిశగా ‘అఖండ 2'

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 09:01 AM

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ 2: తాండవం’ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, వసూళ్ల విషయంలో మాత్రం బాలయ్య జోరు తగ్గలేదు. ఈ చిత్రం తాజాగా యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్ల మార్క్‌ను అధిగమించింది.దీంతో బాలకృష్ణ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. వరుసగా ఐదు చిత్రాలతో 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా ఆయన నిలిచారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ చిత్రాల తర్వాత ఇప్పుడు ‘అఖండ 2’ కూడా ఈ జాబితాలో చేరింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa