ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లోకి చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. ఇప్పటికే పలు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ఆ జాబితాలోకి ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా మరో రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.అమ్మరాజశేఖర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుమన్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ చిత్రం 'సుగుణ' ఇప్పుడు ఓటీటీలో దర్శనమిస్తోంది. 2024లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా చర్చకు రాలేదు. ఎప్పుడు రిలీజై, ఎప్పుడు వెళ్లిపోయిందన్న విషయమే చాలా మందికి తెలియదు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె పద్ధతిలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.అదే తరహాలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బాగుంది' సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహించగా, కిశోర్ తేజ, భవ్యశ్రీ, పద్మిని, పద్మజయంతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa