దర్శకురాలు సుధా కొంగర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆమె దర్శకత్వంలో వచ్చిన ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం ఆమె శివ కార్తికేయన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ‘పరాశక్తి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026 జనవరి 10న విడుదల కానుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఒక లవ్ స్టోరీని తెరకెక్కించాలన్నది డ్రీమ్ అని, ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa