నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ద పారడైజ్'లో హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ ఆఫర్ వచ్చినా, ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాన్వీ చేతిలో ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలు ఉండటంతో, కొత్త ప్రాజెక్టుకు సంతకం చేస్తే ఇబ్బంది అవుతుందని భావించిందని సమాచారం. దీంతో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ కోసం అన్వేషణ ప్రారంభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa