హీరోయిన్ నిధి అగర్వాల్‌కు లులు మాల్‌లో ‘ది రాజా సాబ్’ సినిమా పాట విడుదల సందర్భంగా చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్‌లో ఓ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా అలాంటి అనుభవమే సమంతకూ ఎదురైంది. కార్యక్రమం ముగిశాక తిరిగి వెళుతున్న ఆమెను చూసేందుకు అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. దాంతో తన వ్యక్తిగత సెక్యూరిటీ సాయంతో అతికష్టం మీద అక్కడి నుంచి ఆమె బయటపడ్డారు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. దాంతో అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa