ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డేవిడ్ రెడ్డి'లో నటించే అతిధి పాత్రలపై స్పందించిన మనోజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 18, 2025, 02:55 PM

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'డేవిడ్ రెడ్డి'. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నటుడు శింబు అతిథి పాత్రల్లో కనిపించనున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారానికి మనోజ్ తెరదించారు. ఆ వార్తల్లో నిజం లేదని, ఇప్పటివరకూ ఆ పాత్రల కోసం తాము ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా 'డేవిడ్ రెడ్డి' తెరకెక్కుతోంది. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు మనోజ్ బదులిస్తూ.. "సినిమాలో అతిథి పాత్రలకు మంచి స్కోప్ ఉంది. కానీ, ఆ పాత్రల కోసం ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ వివరాలు నేనే వెల్లడిస్తాను" అని వివరించారు.ఈ సినిమాలో 'వార్ డాగ్' అనే ప్రత్యేకమైన బైక్ కీలక పాత్ర పోషిస్తుందని మనోజ్ తెలిపారు. ప్రభాస్ నటించిన 'కల్కి' చిత్రంలోని 'బుజ్జి' కారును రూపొందించిన బృందమే ఈ బైక్‌ను కూడా తయారు చేసిందని చెప్పారు. సుమారు 700 కేజీల బరువుండే ఈ బైక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa