మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో ఎర్నాకుళం సెషన్స్ కోర్టు.. ఆరుగురిని దోషులుగా నిర్ధారించి, వారికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాధితురాలు స్పందిస్తూ, '8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధాకరమైన ప్రయాణం తర్వాత ఇప్పుడే కాస్త ఉపశమనం కలిగినట్టు ఉంది' అని పేర్కొన్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ బాధితురాలికి మద్దతు తెలిపారు. ఆయన ఆ పోస్ట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, ఆమె ధైర్యాన్ని, పోరాటాన్ని గౌరవిస్తూ ‘ఫోల్డెడ్ హ్యాండ్స్’ అంటూ ఎమోజీ పెట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa