జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రానున్న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 19న విడుదల కానున్న ఈ చిత్రం కోసం కామెరూన్ థియేటర్ టెక్నీషియన్లకు, యజమానులకు ప్రత్యేక లేఖ రాశారు. ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్ ఫైల్, ఫ్రేమింగ్ చార్ట్, లైట్ లెవల్స్, ఆడియో కాన్ఫిగరేషన్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవల్‌ను తగ్గించవద్దని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa