దర్శకుడిగా 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాలతో పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, నటుడిగా మారి సహాయ పాత్రలు చేస్తున్నారు. 'కీడా కోలా' తర్వాత, ఆయన హీరోగా నటించిన 'ఓం శాంతి శాంతి శాంతిః' చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన 'జయ జయ జయహే' చిత్రానికి రీమేక్. భార్యపై ఆధిపత్యం చెలాయించాలని చూసే భర్త, ఊహించని విధంగా భార్య తిరగబడటంతో ఎదుర్కొనే పరిణామాలే ఈ సినిమా కాన్సెప్ట్. గోదావరి బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్లలోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa