పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని మొదటి పాట ప్రోమోను డిసెంబర్ 9న సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది.ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజా ప్రకటనతో పవర్ స్టార్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. డీఎస్పీ మ్యూజికల్ బ్లాస్ట్ ఎలా ఉండబోతోందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa