ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి ‘కాంత’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 10:37 AM

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'కాంత' సినిమా నవంబరు 14న విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం డిసెంబర్‌ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. పీరియాడిక్ జానర్‌లో వచ్చిన ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్‌ తెరకెక్కించారు. సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ ప్రకటనతో 'కాంత' ఓటీటీ విడుదల సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa