చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (MSG) నుంచి చిత్ర బృందం మరో అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి తాజాగా ‘శశిరేఖ’ అనే రెండో పాటను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన ‘మీసాల పిల్ల’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో, రెండో పాటపై నెలకొన్న అంచనాలను అందుకుంటూ ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది.వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ మెలోడీకి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు ప్రాణం పోసింది. ఈ గీతాన్ని భీమ్స్‌తో కలిసి ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ ఆలపించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా, ఇందులో చిరంజీవి, నయనతార సంప్రదాయ వస్త్రధారణలో చాలా అందంగా కనిపించారు. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa